హిల్ట్‌ పాలసీపై తెలంగాణ హైకోర్టులో విచారణ

– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ

హైదరాబాద్‌, డిసెంబర్‌ 5(ఆర్‌ఎన్‌ఎ): హిల్ట్‌ పాలసీపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ పాలసీపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. 9,292 ఎకరాల భూ కేటాయింపుల విషయంలో రూపొందించిన జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉందని హైకోర్టుకు తెలిపారు. దీనిపై సీబీఐ లేదా ఈడీతో దర్యాప్తు చేయించాలని పిటిషనర్‌ విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు ఉన్న రికార్డులను సీజ్‌ చేసి ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేయించాలని కోర్టుకు విన్నవించారు. పిటిషనర్‌ వాదనలు విన్న ధర్మాసనం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. వెంటనే రిప్లై ్గపిల్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 29వ తేదీకి వాయిదా వేసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *