ప్రకటించిన ఏఏఐబీ
న్యూదిల్లీ: గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరిన కొద్ది క్షణాల్లోనే ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానానికి సంబంధించి కీలకమైన బ్లాక్ బాక్సు లభ్యమైంది. అహ్మదాబాద్‌లోని ఓ కాలేజీ భవనంపై గురువారం విమానం కూలిపోగా 265మంది ప్రాణాలు కోల్పయిన విషయం తెలిసిందే. భవన శిథిలాల నుంచి దీన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబి) వెల్లడిరచింది. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. కానీ విమానంలో కీలకంగా ఉండే బ్లాక్ బాక్సులోని సమాచారాన్ని విశ్లేషిస్తే వివరాలు తెలిసే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 40మంది సిబ్బంది పౌర విమానయాన శాఖ బృందాలతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది.




