– పాకిస్థానీని దోషిగా తేల్చిన స్థానిక కోర్టు
– ఇరాన్ ప్రోద్బలంతో రంగంలోకి ఆసిఫ్ మర్చంట్
న్యూయార్క్, మార్చి 7: డోనాల్ట్ ట్రంప్‌ను హత్య చేసేందుకు ప్లాన్ చేసిన కేసులో పాకిస్థానీని అమెరికా న్యాయశాఖ శుక్రవారం దోషిగా తేల్చింది. ఇరాన్ ఆదేశాల ప్రకారం అతను అమెరికా రాజకీయవేత్తలను హత్య చేసేందుకు ప్లాన్ చేసినట్లు అమెరికా న్యాయ శాఖ ఆరోపించింది. నిందితుడిని ఆసిఫ్ మెర్చంట్‌గా గుర్తించారు. 2020లో ఇరాన్ మిలిటరీ నేత ఖాసిమ్ సొలేమని హత్యకు ట్రంప్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌తోపాటు కొందరు అమెరికా నేతలను హత్య చేయాలని ఆసిఫ్ మెర్చంట్ ప్లాన్ చేశారు. దీని కోసం అమెరికాలో కొందరిని రిక్రూట్ చేసేందుకు అతను ప్రయత్నించాడు. ఇరాన్ అధికారుల ఆదేశాల ప్రకారం అమెరికా నేతల హత్య కోసం ఆసిఫ్ రిక్రూట్మెంట్‌కు పాల్పడ్డాడని, దీన్ని ఉగ్రవాద చర్యగా భావిస్తున్నామని అమెరికా న్యాయశాఖ పేర్కొన్నది. న్యూయార్క్ సిటీ కోర్టులో ఈ కేసుపై గత వారం నుంచి వాదనలు జరుగుతున్నాయి. ఇరాన్‌లోని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్‌తో కలిసి హత్యలకు ప్లాన్ చేసినట్లు ఆసిఫ్ మర్చెంట్ అంగీకరించాడు. అయితే టెహ్రాన్‌లో ఉన్న తన ఫ్యామిలీని కాపాడుకోవాలన్న భయంతో ఆ పనిచేసినట్లు చెప్పాడు. ఇరాన్ టాప్ కమాండర్ ఖాసీం సులేమాని హత్యకు ప్రతీకారంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా ఇతర రాజకీయ నేతల హత్యకు కుట్రలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న పాకిస్థాన్ వ్యాపారి ఆసిఫ్ మర్చెంట్‌ను యూఎస్‌లోని బ్రూక్లిన్ న్యాయస్థానం దోషిగా తేల్చింది. ఈ మేరకు తాజాగా తీర్పు వెలువరించింది. ఈ కుట్ర కేసులో అతడికి జీవిత ఖైదు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ వద్ద ఆసిఫ్ మర్చంట్ శిక్షణ పొందినట్లు రుజువైందని అమెరికా న్యాయస్థానం పేర్కొంది. ప్రముఖ రాజకీయ నాయకుల హత్య కోసం ఐఆర్‌జీసీ తనను 2024లో అమెరికాకు పంపిందని అతడు విచారణలో అంగీకరించాడు. అయితే తుది లక్ష్యం ఎవరనేది తనకు వెల్లడించలేదని తెలిపాడు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మాజీ అధ్యక్షుడు జో బైడెన్ , 2024 అధ్యక్ష రేసులో ఉన్న నిక్కీ హేలితో సహా పలువురు కీలక రాజకీయ నేతలు తమ టార్గెట్‌లో ఉన్నట్లు పేర్కొన్నాడు. ఈ ఆరోపణలను ఇరాన్ గతంలోనే ఖండించింది. ఈ కుట్రతో తమకు సంబంధం లేదని తెలిపింది. పాకిస్థాన్‌లోని పలు బ్యాంకుల్లో కొన్నేళ్లపాటు పనిచేసిన ఆసిఫ్ తర్వాత వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. అతడికి పాక్‌లో వివాహం కాగా ఇరాన్‌కు చెందిన మహిళనూ పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. 2024 ఏప్రిల్‌లో అమెరికా వచ్చిన ఆసిఫ్ కిరాయి హంతకుల ఏర్పాటు కోసం ఓ వ్యక్తితో తన ప్రణాళిక గురించి చర్చించాడు. అయితే ఆ వ్యక్తి అండర్‌కవర్‌లో ఉన్న అధికారిగా సమాచారం. అధ్యక్ష ఎన్నికల సమయంలో పెన్సిల్వేనియాలో ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నంకి ఒకరోజు ముందు అండర్‌కవర్ అధికారి సమాచారం మేరకు ఆసిఫ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పాక్‌కు పారిపోయేందుకు విమానం ఎక్కడానికి సిద్ధమవుతుండగా అతడిని పట్టుకున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





