హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 24: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం) 55వ స్నాతకోత్సవం ఆగస్టు 2వ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ జీఈసీహెచ్ విద్యాసాగర్ తెలిపారు. ఈ స్నాతకోత్సవంలో 519మంది యూజీ, పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు పట్టాలు అందుకోనున్నారని ప్రకటించారు. విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహించనున్న ఈ స్నాతకోత్సవంలో భారత వ్యవసాయ పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎం.ఎల్.జాట్ ముఖ్యఅతిథిగా స్నాతకోత్సవ ప్రసంగం చేస్తారని, గవర్నర్, విశ్వవిద్యాలయ కులపతి జిష్ణుదేవ్ వర్మ అధ్యక్షతన స్నాతకోత్సవం జరగనుందని రిజిస్ట్రార్ వివరించారు. స్నాతకోత్సవంలో 519మందిలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన తొమ్మిదిమంది పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేయనున్నట్లు, అలాగే ఇద్దరు పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులకు రూ.25 వేల చొప్పున నగదు బహుమతిని అందజేయనున్నట్లు, 20 మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు కూడా బంగారు పతకాలను అందజేయనున్నట్లు రిజిస్ట్రార్ తెలిపారు. స్నాతకోత్సవానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు స్నాతకోత్సవంలో పాటించవలసిన సూచనలు, అడ్మిట్ కార్డు, డ్రెస్ కోడ్ వివరాలను విశ్వవిద్యాలయం వెబ్ సైట్ షషష.జూj్aబ.వసబ.ఱఅలో చూడవచ్చన్నారు.
2న జయశంకర్ వర్సిటీ స్నాతకోత్సవం



