– కేంద్ర మంత్రి పీయూష్‌కు ఉప ముఖ్యమంత్రి భట్టి ఆహ్వానం
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్ 3: హైదరాబాద్ ఫ్చూర్ సిటీలో ఈనెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరుకావాలని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆహ్వానించారు. పార్లమెంటు భవనంలో కేంద్ర మంత్రిని ఆయన బుధవారం కలిశారు. ఈ సందర్భంగా సమ్మిట్‌లో ఆవిష్కరించనున్న విజన్ డాక్యుమెంట్ గురించి కేంద్ర మంత్రికి భట్టి వివరించారు. ఉప ముఖ్యమంత్రి వెంట ఎంపీలు డాక్టర్ మల్లు రవి, కుందూరు రఘువీర్ రెడ్డి, సురేష్ షెట్కార్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, డాక్టర్ కడియం కావ్య, గడ్డం వంశీకృష్ణ, అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





