- వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి
- అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో ఫూలే జయంతి వేడుకలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: కుల రహిత సమాజ నిర్మాణానికి విద్యే ప్రధాన ఆ యుధమని, అదే మహాత్మా జ్యోతిరావు ఫూలే దార్శనికత అని డా. బిఆర్. అంబేడ్కర్ సార్వత్రి క విశ్వవిద్యాలయం (Ambedkar Open University ) వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. విశ్వవిద్యాలయంలో నిర్వహించిన “సామాజిక సాధికార ఉత్సవాలు”లో భాగంగా ఫూలే జయంతి (Phule Jayanti celebrations ) ని పురస్కరించుకుని స్మారకోపన్యాస కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రొ. చక్రపాణి మాట్లాడుతూ.. సనాతన వ్యవస్థలో విద్య అందరికీ అందుబాటులో లేకపోవడం, సామాజిక వివక్ష కారణంగా అణగారిన వర్గా లు ఎదుర్కొన్న అన్యాయాలు ఫూలేను ఉద్యమా నికి దారి తీశాయని తెలిపారు. కులం, సామా జిక హోదా తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ సమా న విద్యా అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఫూలే పోరాడారని గుర్తుచేశారు. సమాజంలో వివక్ష నిర్మూలనకు, సాధికారతకు విద్యే కీలక సాధనమని స్పష్టం చేశారు.
ప్రధాన వక్తగా హాజరైన సామాజికవేత్త డా. సంగిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, శూద్రులు, మహిళల విద్య కోసం ఫూలే చేసిన పోరాటం ఆ కాలంలో విప్లవాత్మకమని పేర్కొన్నారు. లింగ సమానత్వం, బహుజన హక్కుల సాధన లో ఆయన చేసిన కృషి అపారమని కొనియా డారు. ఫూలే ఆలోచనలు, రచనలను భవిష్యత్ తరాలకు విస్తృతంగా పరిచయం చే యాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమా నికి అకడ మిక్ డైరెక్టర్ ప్రొ.జి.పుష్పా చక్రపాణి అధ్యక్షత వహిస్తూ, డా.అంబేద్కర్ ఫూలే సిద్ధాంతాలు సమాజ అభివృద్ధికి మార్గదర్శకాలని పేర్కొన్నా రు. విద్యార్థులు మహనీయుల జీవిత గాథలను అధ్యయనం చేసి వాటిని ఆచరణలో పెట్టాలని సూచించారు.కార్యక్రమంలో ఇంచార్జి రిజిస్ట్రా ర్ ఎన్.సి. వేణుగోపాల్, ప్రొ. ఆనంద్ పవార్, వీసీ ఓఎస్డీ ప్రొ. రబీంద్రనాథ్ సోలమన్, ప్రొ. పల్లవీ కాబడే, ఉద్యోగ సంఘాల నాయకులు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు. ప్రారం భంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే చిత్రపటాని కి నివాళులు అర్పించారు.
‘ఫూలే’ తెలుగు సినిమా ప్రివ్యూ
కార్యక్రమం అనంతరం విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో ‘ఫూలే’ తెలుగు సినిమా ప్రివ్యూ ను ప్రదర్శించారు. నిర్మాత పొన్నం రవిచంద్ర మాట్లాడుతూ, ఫూలే జీవితాన్ని తెరపైకి తీసు కువచ్చి భవిష్యత్ తరాలకు స్ఫూర్తినివ్వడమే ఈ చిత్ర లక్ష్యమని తెలిపారు. సినిమా నిర్మా ణంలో అనేక సవాళ్లు ఎదురైనా సామాజిక చైతన్యం కోసం పూర్తి చేశామని వెల్లడించారు. చిత్ర రచయిత కత్తి చేతన్ కూడా కార్యక్ర మం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి చిత్ర యూనిట్‌ను సన్మాని స్తూ, సమాజంలోని సామాజిక, ఆర్థిక సమ స్యలను ప్రతిబింబించే విధంగా సినిమా రూ పొందించారని అభినందించారు.





