ఈవీఎంలపై ఇక అభ్యర్థుల ఫోటోలు

– వెల్లడించిన కేంద్ర ఎన్నికల సంఘం

న్యూదిల్లీ,సెప్టెంబర్‌17: ఈవీఎం మిషిన్‌పై గుర్తులే కాకుండా అభ్యరథుల షోటోలు కూడా ఉండేలా చర్యలు చేపడతామని ఈసీ తెలిపింది. వోటర్లు కన్ఫ్యూజ్‌ అవుతూ కొన్ని సార్లు ఒకరికి వేయాల్సిన వోటు మరొక అభ్యర్థికి వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇకనుంచి ఆ కన్ఫ్యూజన్‌ ‌కు తావు లేకుండా మరింత క్లారిటీగా ఈవీఎం మిషన్లను తయారు చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. వోటర్‌ ‌ఫ్రెండ్లీగా ఉండేలా ఈవీఎంలను తయారు చేస్తున్నట్లు ఈసీ బుధవారం ప్రకటించింది. బ్యాలెట్‌ ‌పేపర్‌ ‌మరింత పెద్దదిగా ప్రింట్‌ ‌చేయడంతో పాటు అభ్యర్థుల కలర్‌ ‌ఫోటోను కూడా ముద్రించనున్నట్లు పేర్కొంది. ఈ మార్పులను బీహార్‌ ఎన్నికల నుంచి ప్రారంభిస్తున్నట్లు చెప్పింది. ఎన్నికల నియమావళి, 1961 లోని రూల్‌ 49ఇ ‌నింబంధనలను మారుస్తూ.. అభ్యర్థుల ఫోటోలను పెద్దసైజులో.. కలర్‌ ‌లో ప్రింట్‌ ‌చేయనున్నట్లు ప్రకటించింది. ఇంతకు మందు లేయౌట్‌ ‌బ్లాక్‌ అం‌డ్‌ ‌వైట్‌ ‌లో ఉండేది. ఫోటోలు చిన్నవిగా అస్పష్టంగా ఉండేవి. ఇప్పుడు వోటర్లకు ఎలంటి కన్ఫ్యూజన్‌ ‌లేకుండా ఉండేందుకు ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొంది. అదే విధంగా సీరియల్‌ ‌నెంబర్‌ ‌కూడా చాలా స్పష్టంగా ఇవ్వనున్నట్లు పేర్కొంది.  గతంలో ఉన్న నిబంధనల ప్రకారం.. ఈవీఎం బ్యాలెట్‌ ‌పేపర్లపై కేవలం క్యాండిడేట్స్ ‌డీటైల్స్ ఉం‌టే సరిపోయేవి. అంటే అభ్యర్థి పేరు, పార్టీ గుర్తు, సీరియల్‌ ‌నెంబర్‌, ‌చిన్న ఫోటో (బ్లాక్‌ అం‌డ్‌ ‌వైట్‌ ‌లో) ఉండేది. మార్చిన నిబంధనల ప్రకారం.. బ్యాలట్‌కు సంబంధించి డిజైన్‌, ‌లేయౌట్‌ ‌పూర్తిగా వోటర్‌ ‌ఫ్రెండ్లీగా తయారు చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. పోలింగ్‌ ‌బూత్‌ ‌లలో ఎలాంటి కన్ఫ్యూజన్‌ ‌లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇప్పటికే గత ఆరు నెలల్లో ఎన్నికలకు సంబంధించి 28 మార్పులు తీసుకొచ్చినట్లు చెప్పిన ఈసీ.. ఎన్నికల సరళిని సులభతరం చేసేందుకు నిబంధనలు మార్చుతున్నట్లు పేర్కొంది. అభ్యర్థుల పేర్లతో పాటు నోటా కూడా ఒకే ఫాంట్‌ ‌లో.. లార్జ్ ‌సైజ్‌ ‌లో ప్రింట్‌ అవుతుందని తెలిపింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *