-ఫొటో, ట్రేడ్ ఎక్స్‌పోను ప్రారంభించిన మంత్రి వివేక్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: తెలంగాణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఫొటో ట్రేడ్ ఎక్స్‌పోను రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫోటో, వీడియోగ్రాఫర్స్ సమాజంలో విశేషమైన పాత్ర పోషిస్తున్నారని, ప్రతి వేడుకను, ప్రతి చరిత్రను భవిష్యత్తు తరాలకు అందజేసే ముఖ్య వృత్తి ఇది అని చెప్పారు. ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని, ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇలాంటి ఎక్స్‌పోల ద్వారా కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక పరికరాలు అందుబాటులోకి రావడం వృత్తి అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం మాత్రమే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కూడా పాల్గొనడం ఈ ఎక్స్ పో ప్రత్యేకత అని అన్నారు. ఈ కార్యక్రమంలో 200కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేశాయగా ఫోటో, వీడియో రంగానికి సంబంధించిన కెమెరాలు, లైటింగ్, డ్రోన్స్, సాఫ్ట్‌వేర్స్, ప్రింటింగ్ టెక్నాలజీ వంటి విభిన్న ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ-ఎక్స్‌పోలో ఫొవేలాదిమంది ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ పాల్గొననున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





