ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో కీలక పరిణామం

– బీఆర్‌ఎస్‌ ‌నేత కేటీఆర్‌కు సిట్‌ ‌నోటీసులు
– రేపు 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశం

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 22: ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దూకుడు పెంచిన సిట్‌ అధికారులు తాజాగా బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌కు నోటీసులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్‌లోని ఏసీపీ కార్యాలయంలో విచారణకు హాజరవ్వాలంటూ కేటీఆర్‌కు నోటీసులిచ్చారు. సీఆర్‌పీసీ 160 కింద నందినగర్‌లోని కేటీఆర్‌ ‌నివాసంలో ఈ నోటీసులను సిట్‌ అధికారులు అందజేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్లను ట్యాప్‌ ‌చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై సిట్‌ అధికారులు కేటీఆర్‌ను ప్రశ్నించనున్నారు. తెలంగాణలో ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌వ్యవహారం దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రమేయం ఉన్న పోలీస్‌ ఉన్నతాధికారుల్లో కొందరు ఇప్పటికే అరెస్ట్ అవగా ఇప్పుడు నాయకుల విచారణ జరుగుతోంది. ఇటీవలే మాజీ మంత్రి హరీశ్‌ ‌రావుకు నోటీసులు జారీ చేసిన సిట్‌ అధికారులు ఆయన్ను ఇటీవల విచారించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు అంశాలపై విచారించిన అధికారులు కీలక సమాచారం రాబట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్‌కు నోటీసులు జారీ చేయడం హాట్‌ ‌టాపిక్‌గా మారింది.కేటీఆర్‌కు నోటీసులు జారీ చేయడంపై హరీష్‌రావు తీవ్రంగా స్పందించారు. ’నిన్న నాకు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు కేటీఆర్‌కు ఇచ్చారు. బొగ్గు స్కామ్‌పై సమాధానం చెప్పే దమ్ములేదు. రేవంత్‌ ‌రెడ్డి ఎన్ని నోటీసులు ఇచ్చినా 6 గ్యారంటీలు, 420 హాలు అమలు చేసేదాకా వదలబోము. ఎన్ని అటెన్షన్‌ ‌డైవర్షన్లు చేసినా రేవంత్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆయన వెంటపడుతూనే ఉంటాం’ అని హరీశ్‌ ‌రావు స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *