డెయిలీ సీరియల్‌లా ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌విచారణ

– అన్ని వేళ్లూ ఒకేవైపు చూపిస్తున్నా చర్యలేవీ
– అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్‌ ‌పారిపోయింది
– బీజేపీ మాత్రమే సమర్థ విపక్షంగా పనిచేసింది
– మెదక్‌ ఎం‌పి రఘునందన్‌ ‌రావు మీ

మెదక్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 7: ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసు విచారణ డెయిలీ సీరియల్‌లా సాగుతోందని బీజేపీ సీనియర్‌ ‌నేత, మెదక్‌ ఎం‌పీ ఎం.రఘునందన్‌ ‌రావు వ్యాఖ్యానించారు. మెదక్‌లో బుధవారం ఆయన మాట్లాడుతూ కొండను తవ్వి ఎలుకను ఈ సిట్‌ ‌పడుతుందో లేదో  అంటూ సందేహం వ్యక్తం చేశారు. డేటాను సర్వీస్‌ ‌ప్రొవైడర్ల వద్ద తీసుకోవచ్చునని అభిప్రాయపడ్డారు. నేడు కొండల్‌ ‌రెడ్డి, రేపు ఆయన డ్రైవర్‌ ఇలా ఎన్నాళ్లు అంటూ ‘సిట్‌’ ‌వ్యవహారశైలిపై అసహనం వ్యక్తం చేశారు. కర్త, కర్మ అని ఒకరివైపే వేలు చూపిస్తున్నాయని, కానీ ఆయనను పిలిచేందుకు భయపడుతున్నారంటూ రఘునందన్‌ ‌కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ తతంగమంతా ఎన్నికల కోసం పిలుస్తున్నట్లుగా ఉందన్నారు. ‘సిట్‌’ కాంగ్రెస్‌ ఇన్వెస్టిగేషన్‌ ‌టీమ్‌లా మారిందంటూ ఎద్దేవా చేశారు. కేసులో ఫస్ట్ ‌బాధితుడిని తానేనని గుర్తు చేశారు. కాగా, మొక్కుబడిగా ఐదు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిందంటూ రాష్ట్ర ప్రభుత్వంపై  రఘునందన్‌ ‌రావు మండిపడ్డారు. అసెంబ్లీని బాయ్‌కాట్‌ ‌చేసి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్‌ ‌పూర్తి వైఫల్యం చెందిందని విమర్శించారు. నీటి అంశాలపై చర్చకు పాలకపక్షం మీనమేషాలు లెక్కిస్తే బీఆర్‌ఎస్‌ ‌పార్టీ భయపడి పారిపోయిందని పేర్కొన్నారు. తమ సంఖ్య తక్కువ ఉన్నా గట్టిగా పోరాడి పాలక పక్షాన్ని బీజేపీ నిలదీసిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా బీజేపి శాసనసభా పక్ష నేత మహేశ్వర రెడ్డిని అభినందిస్తున్నానని చెప్పారు. సీఎం రేవంత్‌ ‌రెడ్డి ప్రసంగింస్తుంటే 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా సభలో లేరని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు జిల్లా మీద, కృష్ణా జలాల మీద కాంగ్రెస్‌ ‌పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఇదంటూ అధికార పార్టీ సభ్యులపై నిప్పులు చెరిగారు. కొంతమంది తమ పార్టీ నుంచి వలసపోతే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందన్నారు. యెన్నెం శ్రీనివాస రెడ్డి కూడా పార్టీ నుంచి వెళ్లిన వారేనని గుర్తు చేశారు. ఆలోచించుకోవాలంటూ వలస నేతలకు కీలక సూచన చేశారు. అటు కాంగ్రెస్‌, ఇటు బీఆర్‌ఎస్‌లపై పోరాడేది, ప్రజల పక్షాన ఉండేది బీజేపీ మాత్రమేనని ఎంపీ స్పష్టం చేశారు. తమ పార్టీలో కొత్త పాత అనేది ఏమీ లేదన్నారు. కల్వకుంట్ల కవిత పార్టీ స్థాపిస్తే దేశంలో 6202వ పార్టీ అవుతుందన్నారు. ఎవరు కొత్త పార్టీ పెట్టినా తాము స్వాగతిస్తామని స్పష్టం చేశారు. ఒక నటుడి సినిమాకు టికెట్ల ధర పెంచి మరో నటుడికి పెంచకపోతే అది పక్షపాతం అవుతుందన్నారు. అన్ని సినిమాలకు ఒకటే రూల్‌ ఉం‌డాలని రఘునందన్‌ ‌తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *