– సీబీఐ విచారణకు పట్టుపడుతున్న బీజేపీ
– 28న సిట్ విచారణకు బండి సంజయ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 23: గత బీఆర్ఎస్ హయాంలో జరిగిందని చెబుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జాతీయస్థాయి అంశంగా మారింది. బీజేపీ అధిష్టానం దీన్ని సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో పార్టీ దీనిపై సీబీఐ విచారణకు పట్టుపడుతోంది. ఇదిలావుండగా పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో బండి సంజయ్ విచారణను సిట్ వాయిదా వేసింది. ఈనెల 28న విచారణకు హాజరుకాగలనని ఆయన లేఖ రాసారు. సిట్ ఎదుట బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి కీలక సమాచారం, ఆధారాలు సమర్పించనున్నట్టు తెలుస్తోంది. న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ కావడంతో బీజేపీ సీరియస్ గా వున్నది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో బీజేపీ లీగల్ సెల్ పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే పెద్దాయన(కేసీఆర్) చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని సిట్ ఎదుట రాధాకిషన్ రావు అంగీకరించారు. డీజీపీ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుప్రభాకర్ రావు వెల్లడించారు. ఏతావాతా ఈ మొత్తం కేసు వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్ ల చుట్టూ వుచ్చు బిగుస్తున్నట్టు తెలుస్తోంది.



