– ఒక్క రోజులోనే రూ.5వేలు పెరుగుదల
న్యూదిల్లీ, జనవరి 23: గ్రీన్‌లాండ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వరం మారిన వేళ తగ్గుముఖం పట్టిన పసిడి ధర మళ్లీ పైకెగసింది. డెన్మార్క్ అధీనంలోని ద్వీపాన్ని బలప్రయోగం ద్వారా స్వాధీనం చేసుకోబోమని ట్రంప్ ప్రకటించడంతో గురువారం బంగారంలో లాభాల స్వీకరణ కనిపించింది. అయితే అది ఒక్క రోజుకే పరిమితమైంది. ఇరాన్ చుట్టూ అమెరికా బలగాలు మోహరించడంతో మరోసారి అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించి మదుపర్లు బంగారం వైపు పెట్టుబడులను మళ్లిస్తుండడంతో దీని ధర మళ్లీ పెరిగింది. అంతర్జాతీయ విపణిలో ఔన్సు 5 వేల డాలర్లకు చేరువైంది. ప్రస్తుతం 4,945 డాలర్ల వద్ద కొనసాగుతోంది. దీన్ననుసరించి దేశీయంగా కూడా ధరలు పెరిగాయి. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల మేలిమి పసిడి రూ.1,59,954 పలుకుతోంది. గురువారంతో పోలిస్తే ఒక్క రోజులోనే రూ.5వేలు పెరిగింది. 22 క్యారెట్ల ధర రూ.1.41 లక్షలుగా ఉంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ఔన్సు 98 డాలర్ల వద్ద కొనసాగుతుండగా హైదరాబాద్‌లో కిలో రూ.3.25 లక్షలుగా ఉందని బులియన్ వర్గాలు పేర్కొంటున్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


