– స్పీకర్ సహా ఏడుగురికి హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 25: పార్టీ మారలేదన్న ఏడుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. అలాగే అసెంబ్లీ స్పీకర్‌కు సైతం కోర్టు నోటీసులు ఇచ్చింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని ఇటీవల అసెంబ్లీ స్పీకర్ తీర్పు ఇచ్చారు. స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై బుధవారం విచారణ జరిగింది. దాంతో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఎమ్మెల్యేలతోపాటు స్పీకర్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ చేసిన జాబితాలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, అరికేపూడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, పోచారం శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్ రావు ఉన్నారు. ఏప్రిల్ 16వ తేదీ ఈ కేసు విచారణను వాయిదా వేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.