బీజేపీ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 1: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హైకోర్టులో మరో ఊరట లభించింది. గత ఏడాది మే 4న కొత్తగూడెంలో జరిగిన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగం కారణంగా బీజేపీ పరువుకు భంగం వాటిల్లిందంటూ ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు ఆరోపించారు. బీజేపీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందని రేవంత్ రెడ్డి అన్నారని వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. ప్రజాప్రతినిధుల కోర్టు విచాణలో ఉన్న ఈ కేసును కొట్టేయాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. కాగా, గోపన్‌పల్లి భూవివాదంలోనూ ముఖ్యమంత్రి రేవంత్‌పై ఎన్.పెద్దిరాజు దాఖలు చేసిన ట్రాన్స్‌ఫర్ పిటిషన్‌ను గత సోమవారం సుప్రీం కోర్టు కొట్టివేసిన వింషయం విదితమే.



