– మహాత్మాగాంధీ 78వ వర్ధంతి
– రాజ్‌ఘాట్ వద్ద నివాళులర్పించిన ప్రధాని
న్యూదిల్లీ, జనవరి 30: జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు గాంధీకి నివాళులర్పించారు. కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రముఖులు, రిటైర్డ్ అధికారులు, సామా

జిక కార్యకర్తలు, విద్యార్థులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు నా హదయపూర్వక నివాళులర్పిస్తున్నాను.. ఆయన విలక్షణ వ్యక్తిత్వం, విజయాలు మనందరికీ సరైన మార్గాన్ని చూపిస్తూ ప్రేరణగా ఉంటాయి. అభివద్ధి చెందిన, స్వావలంబన భారతదేశం కోసం మన సంకల్పానికి ఆయన చిహ్నంగా నిలుస్తారని అన్నారు. మహాత్మా గాంధీ జీవితం నిజాయతీ, సత్యాగ్రహం, అహింసా మార్గదర్శకలు, సామాజిక న్యాయం కోసం చేసిన ప్రేరణాత్మక ప్రయత్నాలతో గుర్తింపు పొందిందన్నారు. ఆయన వ్యక్తిత్వం, విజ్ఞానం యువత, ప్రజలకు సామాజిక సమతా, దేశభక్తి, స్వావలంబన పట్ల ప్రేరణగా నిలుస్తాయి. కార్యక్రమంలో గాంధీకి ప్రత్యేక పుష్పాంజలి, ప్రతిమలకు పూల మాలలు, స్మరణీయ ప్రసంగాలు, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. స్థానికులు, పర్యాటకులు కూడా భాగస్వాములయ్యారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





