– కేయూ గ్రంథాలయ శాస్త్ర అధ్యాపకుడు కృష్ణమాచార్య
– కిట్స్ వరంగల్ కేంద్ర గ్రంధాలయంలో పుస్తక ప్రదర్శన
వరంగల్, ప్రజాతంత్ర, నవంబర్ 19: మనిషి వ్యక్తిత్వ వికాసానికి, ఆలోచనలకు, భవిష్యత్ దిశా నిర్దేశానికి పుస్తకాలు బాటలు వేస్తాయని కాకతీయ యూనివర్సిటీ గ్రంథాలయ శాస్త్ర అధ్యాపకుడు వేదాంతం కృష్ణమాచార్య తెలిపారు. చదవాలనే అలవాటు మరింతగా అభివృద్ధి చేసుకోవటం ద్వారా విద్యార్థుల జీవితాన్ని మెరుగుపరిచేందుకు దోహదం చేస్తుందన్నారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వరంగల్ కేంద్ర గ్రంధాలయంలో పుస్తక ప్రదర్శనను బుధవారం విజయవంతంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కృష్ణమాచార్య జ్యోతి ప్రజల్వన చేసి పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా నేటి సాంకేతిక సమాచార సమాజంలో గ్రంథాలయాల ప్రాముఖ్యత, విద్యార్థులకు పఠనపు అలవాట్లు, పుస్తకాల ప్రయోజనాన్ని ఆయన గుర్తు చేశారు. కళాశాల డీన్ అకడమిక్ ప్రొఫెసర్ కె.వేణుమాధవ్ మాట్లాడుతూ పుస్తక పఠనంతో విజ్ఞానం, వికాసం కలుగుతుందని, విద్యార్థుల ఆలోచనలో సమూల మార్పు, సైద్ధాంతిక సాంకేతిక జ్ఞాన సమపార్జన కలుగుతుందని వక్కాణించారు. విద్యార్థులకు మెరుగైన సేవలందించాలనే ఉద్దేశంతో గ్రంథాలయాన్ని డిజిటల్ టెక్నాలజీతో అత్యాదునికీకరించి, ఈ-జర్నల్స్‌ను, ఈ-బుక్స్‌ను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. లైబ్రేరియన్ డాక్టర్ కె.ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో పుస్తక పఠన సంస్కృతి పెరగడమేకాక జ్ఞాన ప్రపంచానికి మరింత దగ్గర చేయగలుగుతామని తెలిపారు. ఈ పుస్తక ప్రదర్శనలో ప్రముఖ పబ్లిషర్స్ సుమారు వెయ్యి కొత్త పుస్తకాలను విద్యార్థులు, అధ్యాపకులు పరిశీలించేలా ఏర్పాటు చేశారు. వారోత్సవాల సందర్భంగా వ్యాసరచన, డిబేట్, క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలైన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో వివిధ విభాగాల ప్రొఫెసర్లు డాక్టర్ వి.రాజగోపాల్, డాక్టర్ శ్రీకాంత్ పబ్బ, డాక్టర్ ఎం.శ్రీకాంత్, డాక్టర్ ఎస్.నర్సింహారెడ్డి, డాక్టర్ పి.నిరంజన్ రెడ్డి, డాక్టర్ యు.శ్రీనివాస్ బాలరాజు, లైబ్రరీ కమిటీ సభ్యులు గ్రంథాలయ సిబ్బంది డాక్టర్ ఎం.నిరంజన్, డాక్టర్ ఎం.అరుణ్ కుమార్, టి.రాజు, సిహెచ్.ప్రకాష్, 200 మంది విద్యార్థినీవిద్యార్థులు, అధ్యాపకులు, కళాశాల ప్రజా సంబంధాల అధికారి డాక్టర్ డి.ప్రభాకరాచారి పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





