– శాసన సభ వద్ద భట్టికి అధికారుల స్వాగతం
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: రాష్ట్ర శాసనసభలో 2026-27 వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతన్న సందర్భంగా ప్రజాభవన్‌లో నల్ల పోచమ్మ అమ్మవారికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రతులను అమ్మవారి ముందుంచారు. అనుకున్న మేర రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూరి సంక్షేమ పథకాలు ప్రజలకు మరింత ఎక్కువగా చేరాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి రైతాంగం అంతా సుభిక్షంగా ఉండాలని కూడా ప్రార్థించారు. అనంతరం బడ్జెట్ ప్రతులతో శాసనసభలో జరుగుతున్న మంత్రిమండలి సమావేశానికి బయలుదేరారు. అసెంబ్లీకి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ప్లానింగ్ అండ్ ఫైనాన్స్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ డి.కృష్ణ భాస్కర్, అసెంబ్లీ సెక్రటరీ తిరుపతి. శాసనమండలి సెక్రటరీ నరసింహాచార్యులు స్వాగతం పలికారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





