– బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9: వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాల్లో స్థిరమైన వృద్ధితో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. సోమవారం జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్ణాటక, హర్యాణలను అధిగమించి రికార్డు సాధించిందన్నారు. వార్షిక రుణ ప్రణాళికలో మొదటి క్వార్టర్‌లోనే 33.64 శాతం సాధించడం అభినందనీయమన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు, స్వయం ఉపాధి పథకాలకు, వ్యవసాయ అనుబంధ రంగాలకు విరివిగా రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. రైతులకు సకాలంలో రుణాలు ఇవ్వండి కానీ ఆస్తుల తాకట్టు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయండి అంటూ వారిని ఒత్తిడి చేయవద్దని సూచించారు. బ్యాంకర్లు మానవీయ కోణంలో ఆలోచించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా భావిస్తున్నదన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా పేరిట రూ.30 వేల కోట్లు రైతుల పక్షాన బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిందన్నారు. బ్యాంకింగ్ రికవరీ చరిత్రలో ఇది ఒక రికార్డు అని పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




