కాంగ్రెస్ పథకాలకు ప్ర‌జ‌ల‌ నీరాజనాలు

– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

కోరుట్ల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం పంపిణీకి జనం నీరాజనాలు పడుతున్నారని, అర్హులైన వారందరికీ తెల్ల రేషన్ కార్డుల మంజూరుతో ప్రజలందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగిన ప్రచార కార్యక్రమంలో ఆయన శనివారం ప్రసంగించారు. కోరుట్ల, భీంగల్, మెట్‌పల్లిలలో విస్తృతంగా పర్యటించారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో మహిళలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరాతో మధ్యతరగతి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బాసటగా నిలుస్తున్నారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమం పథకాలే పురపాలక సంఘం ఎన్నికల్లో విజయభేరి మోగిస్తుందన్నారు. దిల్లీ నుండి గల్లీ వరకు ముస్లిం మైనారిటీలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడిందని, మైనారిటీలకు రక్షణ కవచంగా లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ నిలబడ్డారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్ హామీ ఇచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *