ప్రజల ఆశీర్వాదంతో అన్నింటా దూసుకుపోతున్నాం

– హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను కాపాడుతున్నాం
– ఇందిరమ్మ క్యాంటీన్లను ఉపయోగించుకోండి
– మంత్రి పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29: రాష్ట్రంలో మహిళలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది.. మీ అందరి ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రజా పాలన ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిలో ముందుకు పోతోందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఖైరతాబాద్‌ మింట్‌ కాంపౌండ్‌ వద్ద ఇందిరమ్మ క్యాంటీన్‌లను మేయర్‌ విజయలక్ష్మితో కలిసి ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ అందరికీ బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు చెప్పారు. ఇందిరమ్మ క్యాంటీన్‌లు అందరూ ఉపయోగించుకోవాలంటూ వీటి ప్రారంభానికి సహకరించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. తెలిపారు. మీ అందరి సహకారంతో ఇందిరమ్మ ప్రభుత్వం రేషన్‌ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, రూ.500లకి గ్యాస్‌, ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తోంది అని తెలిపారు. హరే రామ హరే కృష్ణ వాళ్ళతో ఒప్పందం చేసుకొని రూ.19ల ఖర్చయ్యే అల్పాహారాన్ని రూ.5లకు, రూ.30 ఖర్చు అయ్యే భోజనాన్ని రూ.5లకు అందిస్తున్నామని చెప్పారు. అలాగే కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మహిళా సంఘాలకు సోలార్‌ ప్లాంట్లు, పెట్రోల్‌ బంకులు ఇస్తూ ఆర్టీసీ బస్సులకు యజమానులను చేస్తున్నదన్నారు. హైదరాబాద్‌లోని మహిళా సంఘాలలో సంఖ్య తక్కువగా ఉందని, వీటిల్లో సభ్యులు 16 నుండి 65 వరకు ఉండేలా మార్చామని చెప్పారు. బయట వడ్డీకి అప్పు తెస్తే మహిళా సంఘాలకు సున్నా వడ్డీకి రుణాలు ఇస్తారు.. ఇలాంటి ఇందిరా క్యాంటీన్‌లు పెట్టుకోవచ్చు.. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను కాపాడుకునే విధంగా రాత్రి పగలు లేకుండా శ్రమిస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో ఇల్లు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నం.. ఎక్కడ పనిచేస్తే అక్కడే ఇల్లు నిర్మించాలని ప్లాన్‌ చేస్తున్నామన్నారు. జీహెచ్‌ఎంసీ శానిటేషన్‌ సిబ్బందికి మంత్రి పొన్నం అల్పాహారం వడ్డించారు. అనంతరం మంత్రి, మేయర్‌, ఇతర ముఖ్య నేతలు అక్కడే అల్పాహారం చేశారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, కార్పొరేటర్లు విజయారెడ్డి, మహాలక్ష్మి, సంగీత యాదవ్‌ , జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌, జోనల్‌ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *