– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు ప్రజా పాలనకు ప్రజలు పట్టం కట్టిన తీర్పు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. నమ్మకం, విశ్వాసం ఉన్నప్పుడు అది ఆదరణగా మారుతుందని ప్రజలు మరోసారి నిరూపించారని తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతులు వంటి కీలక రంగాల్లో సాధికారత లక్ష్యంగా గత రెండేళ్లుగా ప్రజా ప్రభుత్వం అవిశ్రాంతంగా పనిచేస్తోందని, ఈ గెలుపు ఆ కృషికి లభించిన గౌరవం అని పేర్కొన్నారు. నిష్కల్మష నాయకత్వం, పారదర్శక పరిపాలన, సమష్టి కృషి ఇవే ఈ విజయానికి పునాది అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రిగా నా బాధ్యతలతోపాటు మంత్రివర్గం మొత్తం కలిసికట్టుగా అభివృద్ధి కార్యాచరణను ముందుకు తీసుకెళ్లిందని వివరించారు. కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా శ్రమించారని, ప్రజలు అభివృద్ధికి మద్దతు ఇచ్చారని, రాష్ట్రం మొత్తం వ్యక్తమైన ఈ ఆదరణ రానున్న మార్పుకు సంకేతం అని డిప్యూటీ సీఎం అభివర్ణించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, అభిమానాన్ని వమ్ము కానివ్వకుండా మరింత బాధ్యతతో, మరింత కట్టుబాటుతో పనిచేస్తామని హామీ ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





