వికలాంగులు, వితంతుల పెన్షన్లు పెంచలేదు

– బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డికి మంత్రి సీతక్క కౌంటర్

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 24: పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్న బీజేపీ గత పదేళ్లుగా వికలాంగులు, వితంతుల పెన్షన్లు పెంచలేదని, వ్యవసాయంపై నల్ల చట్టాలు తెస్తే రాహుల్ గాంధీ పోరాటంతో వెనక్కి తీసుకున్నారని పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క విమర్వించారు. 16 లక్షల కోట్ల బడా పారిశ్రామికవేత్తలకు రుణ మాఫీ చేశారు కానీ రైతు రుణ మాఫీ చేయలేదన్నారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సీతక్క అసెంబ్లీలో కౌంటర్ ఇచ్చారు. ఒక్క రేషన్ కార్డు కూడా కొత్తగా ఇవ్వలేదు.. వడ్డీ లేని రుణాల మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. రూ.58 వేల కోట్ల బ్యాంకింగ్ రుణాలు ఇచ్చామని, కేంద్రం ఏరకంగా మద్దతు ఇవ్వకున్నా ప్రజా సంక్షేమం కోసం నిధులు అధికంగా వెచ్చిస్తున్నామని తెలిపారు. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు.. నిధులు తెచ్చే బాధ్యత మీకు లేదా అని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నాం.. ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.. సన్న వడ్లకు బోనసిస్తున్నాం.. నాలుగున్నర లక్షల కోట్ల ఇందిరమ్మ ఇండ్లు కడుతున్నాం అని వివరించారు. మీ ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రజలకు పనిలేదన్నారు. రైతులకు ప్రతి నెలా పెన్షన్స్ ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.. నల్ల ధనం తెచ్చి రూ.15 లక్షలు ప్రతీ వ్యక్తి ఖాతాలో వేస్తామన్నారు.. రూ.50లకే లీటర్ పెట్రోల్ ఇస్తామని పెట్రోల్ ధరలను ఇష్టారాజ్యంగా పెంచారు.. విభజన హామీలు నెరవేర్చకుండా వట్టిగా ప్రసంగిస్తే ఉపయోగాలు ఉంటాయా అని నిలదీశారు. తెలంగాణ పన్నులు కావాలి కానీ తెలంగాణ ప్రజల ప్రయోజనాలు పట్టవా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ తీరు వల్ల ఆర్థిక ఒడిదొడుకులు వున్నా హామీలను అమలు చేస్తున్నాం.. ప్రభుత్వ ఆర్థిక చేయూతతో 4 లక్షల 70 వేల వ్యాపారాలను మహిళలు ప్రారంభించారుని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని చెప్పారు. ఎగతాళి చేయడం మీకే చెల్లిందన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో తెలంగాణకి ఏం ఇచ్చారో చెప్పండన్నారు. ఏ ఒక్క ప్పు్రాక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు.. ఈ పన్నెండేండ్లలో విభజన హామీలకు సంబంధించి బకాయిలుగానీ ఇవ్వలేదు. అన్ని రాష్ట్రాలకి ఇచ్చుకుంటూ ఇక్కడ ఇవ్వకుండా, చాలా నిధులు ఇస్తున్నామని చెప్పడం దుర్మార్గమని అన్నారు. మీలోనే ఎంతో విద్వేషం, దుర్బుద్ధి ఉందనేది అర్ధం అవుతోందన్నారు. గతంలో కాంగ్రెస్ తీసుకు వచ్చిన మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయిమెంట్ గారంటీ స్కీంలో 100% 100 రోజులు కేంద్రమే ఇచ్చేలాగా ఉంది. కానీ ఇపుడు మీరు 125 రోజులు అని చెప్పి 60% కేంద్రం ఇస్తది, 40% రాష్ట్రం భరించాలి అన్నారు. ఆ ప్రకారం 75 రోజులు మాత్రమే కేంద్రం ఇస్తుంది. మిగతా 50 రోజులకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి.. మా ఇంట్లో వండుకుని మేము తినడానికి మీ పర్మిషన్ ఎందుకు.. మీరు కోతగా చట్టం తెచ్చి అది గొప్ప అని చెప్పుకోవడం తప్పు అన్నారు. అదేవిధంగా 266 రకాల పనులు ఎంజీనరేగా కింద జరిగాయి. ఈ రోజు మీరు తెచ్చిన చట్టం ఆటంకంగా ఉంది, పేద వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది. ఆ చట్టంలో మార్పులు తీసుకురమ్మని కోరుతున్నామన్నారు. బీమారు గురించి చెప్పినారు ప్రధాని మంచి చెడులు ఉంటే సవరించాలి కదా.. మహాత్మా గాంధీ పేరుని కూడా చట్టం నుంచి తొలగించారు.. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహనీయుడిని ఆరఎసఎస్ చంపింది.. గాంధీ ఏం అన్యాయం చేసిన్రు.. అదే ఆరఎసఎస్‌ని పటేల్ నిషేధించారు.. గాడ్సే ఎవరో చెప్పండి.. ఆరఎసఎస్‌తో సంబంధాలు లేవా అని మంత్రి సీతక్క నిలదీశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *