కొత్తగా రెండు లక్షల మందికి పెన్షన్లు

– శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి

చిట్యాల (నల్లగొండ జిల్లా ), ప్రజాతంత్ర, ఏప్రిల్ 2 : రాష్ట్రంలో కొత్తగా 2 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామసభలో ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మల్యే వేముల వీరేశం, కలెక్టర్ బి.చంద్ర శేఖర్ తో కలసి పాల్గొన్న గుత్తా సుఖేందర్ రె డ్డి మాట్లాడుతూ.. గత రెండేళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని సంక్షేమ పథకాలను ప్రజల కు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం గత నెల 30న రాష్ట్ర బడ్జెట్ను ఆమోదించుకుందని,ని యోజకవర్గానికి 3500 చొప్పున నాలుగు లక్షల ఇందిర మైండ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు ఇప్పటికే మొదటి విడత బేస్మెంట్ పూర్తి చేసుకున్న వారికి పిల్ల ర్లు వేసుకున్న వారికి కూడా ఇందిర మైండ్లు ఇచ్చేందుకు ప్రభుత్వ నిర్ణయించినట్లు వెల్లడిం చారు. నియోజకవర్గానికి ఒక తెలంగాణ మోడల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని అది ఉరుమడ్లలో తెలంగాణ మోడల్ స్కూల్ కు ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయా లు, సీసీ రోడ్లు ఉన్నందున మోడల్ స్కూల్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్ వేముల వీరేశంను కోరారు. గ్రామాన్ని అన్ని రకాలు
గా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటు న్నామని తెలిపారు. సిసి రోడ్లు కమ్యూనిటీ హా ల్స్ నిర్మించామని రెండు అంగన్వాడీ భవనా న్ని పూర్తి చేశామని, రూ.2.30 కోట్లతో చెరు వును పటిష్టం చేశామన్నారు. రూ.2 కోట్ల తో గ్రామానికి బీటీ రోడ్డు మంజూరైందని తెలిపా రు. గ్రామంలో 11 మంది ఎస్సీలకు భూ ములు అందించామని, అయితే దారి లేనందు న ప్రత్యామ్నాయంగా మరో భూమిని కేటాయి స్తామని తెలిపారు. ప్రభుత్వ విప్ వేముల మాట్లాడుతూ గడిచిన రెండేళ్లు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటూ ప్రభు త్వం ప్రజల అభివృద్ధి కార్యక్రమాలను అమ లు చేస్తోందని అన్నారు. ఉచిత విద్యుత్తు, రూ.500కు సిలిండర్, సన్న బియ్యం తదితర పథకాలు ప్రజలకు అందుతున్నాయని అన్నా రు. అర్హులైన వారికి రేషన్ కార్డులు రావాల్సి ఉందని వాటిని కూడా ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. కలెక్టర్ బి.చంద్రశేఖర్ మా ట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మార్చి 6న ప్రారంభమైన కార్యక్ర మం మార్చి 15 వరకు పరిశుభ్రత క్లియరెన్స్ జరిగిందని తెలిపారు పాఠశాల, ఇంటర్ వి ద్యార్థులకు అల్పాహారం, అన్ని వర్గాల ప్రజలకు జీవిత బీమా, దివ్యాంగులకు మోటారు బ్యాటరీ సైకిల్, రైతులకు మేలైన వంగడాలు ఇస్తున్నామని తెలిపారు. అంతకుముందు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో శాసనమండలి చైర్మన్ గుప్తా ప్రభు త్వ విప్పు వేముల వీరేశం కలెక్టర్ చంద్రశేఖర్లు ప్రారంభించారు. కార్యక్రమం లో డిసిసి అధ్యక్షులు పున్న కైలాస నేత, సీఈఓ ప్రేమకరణ్ రెడ్డి, ఎమ్మార్వో విజయ ఎండిఓ జయలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్రా వినో దమోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ కోమ టిరెడ్డి చిన్న వెంకటరెడ్డి జిల్లా ప్రధాన కార్య దర్శి పోకల దేవదాస్, హౌసింగ్ ఏడి ఏవో పగిడిమర్రి గిరిబాబు, ఆర్ జానీ షరీఫ్,పి ఆర్ ఏ ఈ సందీప్ రెడ్డి, హౌసింగ్ ఈ అబ్దుల్ వాజిద్, ప్రీతి, వనమా వెంకటేశ్వర్లు, గుండెబోయిన సైదులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి పల్లపు బుద్ధుడు, రంగ వెంకన్న, గ్రామ సర్పంచ్ సాగర్ల భాను శ్రీ. గ్రామ ఉప సర్పంచ్ ఉయ్యాల నరేష్ పోలగోని నరసింహ పోలగోని స్వామి చెరుకు సైదులు ఉయ్యాల లింగయ్య పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *