ఇందిరమ్మ ఇండ్ల ఎల్‌-3 లబ్దిదారులకు ఊరట

– రూ.12 కోట్ల పెండింగ్‌ బిల్లుల విడుదల

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 13: ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇంటి నిర్మాణపు పనులు చేపట్టిన తరువాత వివిధ కారణాల వల్ల బిల్లులు ఆగిపోయిన ఎల్‌-3 కేటగిరీ లబ్దిదారులకు సంబంధించిన బిల్లులను విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించుకున్న అనంతరం అర్హులైన సుమారు 1072 మంది లబ్దిదారులకు సంబంధించిన రూ.12.17 కోట్ల పెండింగ్‌ బిల్లులను విడుదల చేసినట్లు హౌసింగ్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వి.పి.గౌతం తెలిపారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వరంగల్‌లో ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ ఎల్‌-3 కేటగిరీలోని లబ్దిదారుల బిల్లుల చెల్లింపుల అంశాన్ని పరిష్కరించాలంటూ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల బిల్లు చెల్లింపుల ప్రక్రియ నిశిత పరిశీలనలో లబ్దిదారులు ఆర్సీసి అద్దె ఇండ్లలో నివస్తుండటం, గతంలోని ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్దిపొంది ఉండటం తదితర కారణాల వల్ల బిల్లులను విడుదల చేయలేదు. ఈ అంశాన్ని పరిశీలించవలసిందిగా పలువురు ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో సొంత ఇంటి వసతి లేక ఆర్‌సిసి ఇండ్లలో అద్దెకు ఉంటూ ప్రస్తుతం ఇండ్లు కట్టుకుంటున్న వారితోపాటు పాత ఇందిరమ్మ పథకంలో బేస్‌మెంట్‌ పనుల వరకే లబ్ది పొందిన వారికి బిల్లులను విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ కేటగిరీలోని వారికి సంబంధించి కలెక్టర్ల నుంచి వ‌చ్చిన‌ నివేదికలను అనుసరించి అర్హులైన 1072 మందికి బిల్లులను విడుదల చేస్తున్నట్లు మేనేజింగ్‌ డైరెక్టర్‌ తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *