ఖమ్మం, ప్రజాతంత్ర, డిసెంబర్ 24: తను రాసుకునే పెన్సిలే విద్యార్థి ప్రాణం తీసింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెంలో బుధవారం జరిగింది. విహార్ (6) స్థానిక ప్రైవేటు పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం పాఠశాల విరామ సమయంలో మూత్రశాలకు వెళ్లి తిరిగి పరుగెత్తుకుంటూ తరగతి గదికి వస్తుండగా.. అదుపు తప్పి కింద పడిపోయాడు. అదే సమయంలో చిన్నారి చేతిలో ఉన్న పెన్సిల్ గొంతులో గుచ్చుకుంది. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో 108 వాహనంలో కూసుమంచి ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





