జూబిలీ హిల్స్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 30: జూబ్లీహిల్స్ ప్రసిద్ధ పెద్దమ్మతల్లి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు (కేటీఆర్) దంపతులు మంగళవారం ఆలయాన్ని సందర్శించారు. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఆహ్వానం మేరకు ఆలయానికి విచ్చేసిన కేటీఆర్ దంపతులు, పెద్దమ్మతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం, ఆలయ అర్చకులు కేటీఆర్ దంపతులను ఆశీర్వదించి, వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



