బీసీ బిల్లుకు అడుగడుగునా బీజేపీ అడ్డంకులు

– రాహుల్‌ ప్రధాని కావాలన్నది వైఎస్‌ కోరిక
– వైఎస్‌ వర్ధంతి సందర్భంగా పిసిపి నివాళి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: బీసీ రిజర్వేషన్లపై సోమవారం గవర్నర్‌ వద్దకు అఖిలపక్షం వెళ్లిందని, బీఆర్‌ఎస్‌ నేతలు వచ్చారు కానీ బీజేపీ ముఖం చాటేసిందని టీపీసీసీి చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. గాంధీ భవన్‌లో ఆయన విూడియాతో మాట్లాడుతూ బీసీ ఓట్లతో గెలిచిన నాయకులు ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మూడు చట్టాలు తెచ్చినా బీజేపీ అడ్డుపడుతోందని మండిపడ్డారు. బీసీ నాయకులమని, బీసీ బిడ్డలమని చెప్పుకునే అర్హత ఎక్కడిదని నిలదీశారు. మాజీ సీఎం కెేసీఆర్‌ కుటుంబం రాష్ట్ర ప్రజల సొత్తు దోచుకుందని, ప్రజా క్షేత్రంలో బీఆర్‌ఎస్‌ కు శిక్షపడిరదని అన్నారు. ఘోష్‌ కమిషన్‌ నివేదికపై తదుపరి చర్యల నిర్ణయం బీజేపీిపై ఉందన్నారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో ఎమ్మెల్సీ కవిత భాగస్వామిగా ఉన్నారని, కాళేశ్వరం అవినీతిపై చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌ను ఆమె ఎప్పుడైనా అడిగారా అని ప్రశ్నించారు. కవితకు ఈ రోజు కనబడుతున్న అవినీతి ఆ రోజు ఎందుకు కనబడలేదని మహేష్‌ గౌడ్‌ అని ప్రశ్నించారు. పంపకాల్లో తేడా జరిగి ఉండవచ్చని.. అవినీతి జరిగింది వాస్తవమని, వాటాల్లో తేడా తప్ప.. ప్రజా సొమ్ము దుర్వినియోగం జరిగిందనేది వాస్తవం అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని ప్రధానిగా చూడాలని దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి చిరకాల కోరిక అని మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. వైఎస్‌ఆర్‌ తన కోరిక తీరకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్‌ గాంధీ తప్పకుండా ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. నేడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా గాంధీభవన్‌లో ఆయన చిత్రపటానికి మహేష్‌ కుమార్‌ గౌడ్‌ సహా మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు నివాళులర్పించారు.
కేవీపీ రామచంద్రరావు, దానం నాగేందర్‌ వైఎస్‌ఆర్‌ సేవలను గుర్తుచేసుకున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *