– రాహుల్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతాం
– పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్
న్యూదిల్లీ, జూలై 24: బీసీ బిల్లు అమలయ్యేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సి అనివార్యతను కాంగ్రెస్ పెద్దలకు సీఎం రేవంత్ బృందం వివరించింది. ఈ సందర్భంగా ముఖ్యంగా కులగణన తీరుతెన్నులపై రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారు. ఏయే కులాలు ఎంత శాతం ఉన్నాయో అడిగారు. ఎస్సీ, ఎస్టీ జనాభా ఎంత ఉందో ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. కులగణన విధానంపై పూర్తిగా సమాచారం తీసుకున్నారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన బీసీ బిల్లు ఆర్డినెన్స్ ను కేంద్రం ఒప్పుకోకపోతే దేశ వ్యాప్త ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. బీసీ బిల్లుపై బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని అన్నారు. అసెంబ్లీలో వోటేసిన బీజేపీ.. ఇప్పుడు మెలిక పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ విషయంలో రాంచందర్ రావు స్టేట్ మెంట్.. బీసీలకు వ్యతిరేకం అని చెప్పకనే చెబుతోందని అన్నారు. మరోవైపు బీఆర్‌ఎస్ కూడా బీసీలకు అన్యాం చేసిందని అన్నారు. బీఆర్‌ఎస్ 33 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో తగ్గించి మోసం చేశారని విమర్శించారు. దిల్లీలో మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన కీలక సమావేశం అనంతరం తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన కుల సర్వే విధివిధానాలు, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలపై చర్చించామన్నారు. అలాగే తెలంగాణలో కులగణన సర్వే శాస్త్రీయ్ర బద్దంగా చేసిన తీరుపై పార్టీ అగ్ర నేతలకు వివరించామని, రెండు గంటలపాటు సమావేశం జరిగిందన్నారు. మేం ఇచ్చిన సమాచారాన్ని రాహుల్ గాంధీ, ఖర్గే విన్నారని, కేంద్రంలో పెండిరగ్లో ఉన్న బిల్లులపై వారికి వివరించామన్నారు. గవర్నర్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన బిల్లులు ఇక్కడ పెండిరగ్ లో ఉన్నాయన్నారు. దీని కోసం రాష్ట్రం పంపిన బిల్లుల ఆమోదానికి కేంద్రంతో పోరాడాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఇంకా సుప్రీం కోర్టు రిజర్వేషన్ల క్యాప్ ను తొలగించేందుకు కేంద్రం పై ఒత్తిడి తెచ్చేలా పార్లమెంట్ లో పోరాడాలని కోరినట్లు తెలిపారు. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం చేయాల్సింది చేసింది.. కేంద్రం వద్ద పెండిరగ్ లో ఉందని పేర్కొన్నారు. మరోవైపు, బీజేపీ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉందన్నారు. శాసనసభలో బీజేపీ వోటు వేసింది.. కానీ, కేంద్రం వద్దకు వచ్చే సరికి బీజేపీ యూటర్న్ తీసుకుందని తెలిపారు. దీనిపై 9వ షెడ్యూల్ లో చర్చ జరిపేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. అంతేకాకుండా తాము ఇండియా కూటమిలో ఉన్న అన్ని పార్టీల నేతలతో మాట్లాడుతామని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ఎంపీలకు కుల గణనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు ఇస్తారని ఆయన తెలిపారు. తెలంగాణ రోల్ మోడల్ గా మారిందని.. ఒకవేళ కేంద్రం ఆమోదం తెలపకుంటే.. రాహుల్ నేతృత్వంలో ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు.





