– అధ్యక్ష బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది పూర్తి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబరు 6: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని నివాసంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసినట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను ముఖ్యమంత్రి రేవంత్ అభినందించారు. ఇద్దరు నేతలు వివిధ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కాగా, టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశాన్ని మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈనెల 8వ తేదీన జరగనున్నది. ఈ సమావేశానికి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ హాజరుకానున్నారు. సమావేశంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఉమ్మడి జిల్లాల ఇన్‌చార్జిలు, అనుబంధ సంఘాల చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కో ఆర్డినేటర్లు, జిల్లా కమిటీ కోసం వేసిన కో ఆర్డినేటర్లు, అధికార ప్రతినిధులు, జై బాపు జై భీమ్, జై సంవిధాన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొననున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





