– కామారెడ్డి సభకు భారీగా ఏర్పాట్లు
– ఎమ్మెల్యేలు కోరుకుంటే మళ్లీ రేవంతే సిఎం
– పిసిసి చీఫ్ మహేశ్ గౌడ్
హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 5: బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తున్నట్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌తెలిపారు. కార్యకర్తలను కూడా పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కామారెడ్డిలో బహిరంగ సభ ఏర్పాటుకు సీఎం ఆదేశాలతో సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. వొచ్చే ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోనే ముందుకు వెళ్తాం. ఎమ్మెల్యేలు కోరుకుంటే రేవంత్‌రెడ్డే మళ్లీ సీఎం అవుతారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలుపుకొని వెళ్తున్నాం. క్రమశిక్షణ విషయంలోనూ ఎక్కడా రాజీపడటం లేదు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ నిష్పక్షపాతంగా నిర్వహించాలి. సీబీఐలో కొంత లొసుగులు ఉన్నాయి. అది వాస్తవం అని మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు.ఈ నెల 15 వ తేదీకి పిసిసి పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తి అయిందని, క్రమశిక్షణ విషయంలో కూడా ఎక్కడా రాజీపడలేదని తెలియజేశారు.బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తున్నామని, కార్యకర్తలను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తున్నామని పేర్కొన్నారు. కాళేశ్వరంపై సిబిఐ విచారణ నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించారు. సిబిఐలో కొంత లొసుగులు ఉన్నాయని అది వాస్తవం అని అన్నారు. వొచ్చే ఎన్నికల్లో సిఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకు వెళతామని, ఎమ్మెల్యేలు కోరుకుంటే రేవంత్ రెడ్డే మళ్లీ సిఎం అవుతారని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





