కెసిఆర్‌ ‌వదిలిన బాణం కవిత

–  పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ 

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 3: ‌కేసీఆర్‌ ‌కుటుంబ సభ్యులు అవినీతి సొమ్మును పంచుకొని ఇప్పుడు తిట్టుకుంటున్నారని టీ-పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ అన్నారు. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. కవిత చెప్పిన విషయాలన్నీ వాస్తవమేనని, త‌మ పార్టీపై, త‌మ నేత‌ల‌పై చేసిన ఆరోప‌ణ‌లు అవాస్త‌వాల‌ని చెప్పారు. రాష్ట్రంలో పదేళ్లపాటు యథేచ్ఛగా దోపిడీ జరిగిందన్నారు. పంపకాల్లో విభేదాలు వచ్చి ఇప్పుడు బయటపడుతున్నారన్నారు. వాళ్ల పార్టీ లేకుండా వారే చేసుకుంటున్నారు. కవిత ఇన్ని రోజుల త‌ర్వాత బాణాన్ని హ‌రీష్‌రావుపైకి ఎందుకు ఎక్కుపెట్టార‌ని ప్ర‌శ్నించారు.  అమెరికా వెళ్లి వచ్చాక కవిత వైఖరిలో మార్పు కనిపించిందన్నారు.. కవిత..కేసీఆర్‌ ‌వొదిలిన బాణమని నా సందేహం. కేసీఆర్‌ ‌కుటుంబంలో ఇది కొత్త నాటకం అని అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *