– నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత బీజేపీదే
– పిసిసి చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్1: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిన మాట వాస్తవమని టీపీసీసీ అధ్యక్షుడు,ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణలో 90 శాతానికి పైగా ప్రజలు దీన్ని నమ్మినందుకే భారత రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని గద్దెదించారని చెప్పారు. శాసన మండలి మీడియా పాయింట్ వద్ద మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కతో కలిసి ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగినందునే విచారణను సీబీఐకి అప్పగించాం. కాళేశ్వరం అంశంపై మాట్లాడలేకే కేసీఆర్ మొహం చాటేశారు. బీసీ బిల్లు కోసం కాంగ్రెస్ చిత్తశుద్ధితో పోరాడుతోంది. భాజపా, భారత రాష్ట్ర సమితి పార్టీలు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం. మండలిలో బీసీ బిల్లు ఆమోదం పొందకుండా చేసేందుకు భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీలు నానా హంగామా చేశారు. భాజపా తరహాలోనే ఆ పార్టీ కూడా బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని మహేశ్‌కుమార్ గౌడ్ విమర్శించారు. మాజీ సిఎం కెసిఆర్ అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేశారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కెసిఆర్ కుటుంబ అవినీతిని బయట పెట్టిందని అన్నారు. బిజెపి డిమాండ్ చేసినట్టే కాళేశ్వరంపై విచారణ సిబిఐకి అప్పగించామని, కాళేశ్వరంపై సిబిఐ విచారణ పూర్తి చేసి బిజెపి నిబద్ధత చాటుకోవాలని సూచించారు. 42 శాతం బిసి రిజర్వేషన్లను బిఆర్‌ఎస్ అడ్డుకునే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిన మాట వాస్తవం కాదా? అని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ అవినీతిని ప్రజలు నమ్మారు కాబట్టే వారిని గద్దె దించారని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





