-మంత్రి సీతక్కకు ఎఫ్‌టీఏ ఉద్యోగుల వినతి
-సానుకూలంగా స్పందించిన మంత్రి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: గత 20 సంవత్సరాలుగా ఉపాధి హామీ పథకంలో ఎఫ్ టీఏలుగా పనిచేస్తున్న తమకు పే స్కేల్ వర్తింపచేయాలని శుక్రవారం మంత్రికి వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ గ్రామీణ అభివృద్ధి శాఖలో పనిచేస్తున్న ఉపాధి హామీ ఉద్యోగులు సచివాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా దినోత్సవ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క తో శుక్రవారం బేటి అయ్యారు. కేవలం రూ. 30 కోట్లు ప్రతి సంవత్సరం అదనంగా వెచ్చిస్తే తమకు పే స్కేల్ అమలు చేయవచ్చని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన మంత్రి సీతక్క పే స్కేల్ కు సంబంధించిన ఫైల్ ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పే స్కేల్ పై క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న చిరు ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు. అయితే పలు సాంకేతిక సమస్యలను కారణంగా చూపుతూ పే అండ్ అకౌంట్స్ సెక్షన్ తమ జీతాల చెల్లింపుల్లో జాప్యం చేస్తుందని ఎఫ్‌టీఈలు మంత్రికి మోర పెట్టుకున్నారు. వెంటనే స్పందించిన మంత్రి సీతక్క పే అండ్ అకౌంట్స్ సెక్షన్ అధికారులతో మాట్లాడారు. చిన్న చిన్న సమస్యలతో చిరు ఉద్యోగుల జీతాలు ఆపొద్దని, మానవత దృక్పథంతో వ్యవహరించి జీతాలు చెల్లించాలని ఆదేశించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





