– రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బకాయిల సాధన కమిటి ధర్నా
వరంగల్, ప్రజాతంత్ర, నవంబర్ 13: రిటైర్డ్ ఉద్యోగుల, టీచర్ల పెండిరగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏకశిలా జయశంకర్ పార్కు వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ, పూర్వ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం ప్రధాన కార్యదర్శి వి.బాబురావు ధర్నాను ప్రారంబించారు. రాష్ట్ర కో కన్వీనర్ జిల్లా అధ్యక్షుడు శ్రీదర్ల ధర్మేంద్ర అధ్యక్షత వహించి మాట్లాడుతూ మార్చి 2024 నుండి రిటైర్డ్ ఉద్యోగుల పెండిరగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గతంలో కలెక్టర్ల ద్వారా ముఖ్యమంత్రికి వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ప్రభుత్వం నుండి ఏ విధమైన స్పందన రాకపోవడంతో ఈ రోజు ధర్నా చేపట్టినట్లు చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ప్రధాన కార్యదర్శి కడారి భోగేశ్వర్ మాట్లాడుతూ ధర్నాకు సంఫీుభావంగా విచ్చేసిన హన్మకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డినుద్దేశించి సార్.. మా బకాయిలు అందక రిటైర్డ్ ఉద్యోగుల జీవితాలు వేదనా భరితంగా ఉన్నాయి.. చాలామంది మానసిక వేదనతో చనిపోతున్నారు.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి రిటైర్మెంట్ బకాయిలు ఇప్పించి, మరణాలు ఆపండి అని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే నాయిని స్పందిస్లూ ముఖ్యమంత్రి ఏవిధంగానైనా చెల్లించే ఆలోచనలో ఉన్నారు. తాేను కూడా సీఎం దృష్టికి తీసుకెళ్ళి త్వరలో బకాయిలు అందేటట్టు చేస్తా అని హామీ ఇచ్చారు. శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి సంఫీుభావంగా ధర్నాకు హాజరై మాట్లాడుతూ రిటైర్మెంట్ బకాయిలు, బెనిఫిట్స్ ఆపడం సరికాదు.. వెంటనే చెల్లించాలని తాను శాసనమండలిలో పోరాడతానని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, జడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు ధర్నా కార్యక్రమానికి సంఫీుభావం ప్రకటించారు. భారత్ బచావో నాయకుడు ఎం.వెంగళ్ రెడ్డి, సాధన కమిటీ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు కందుకూరి దేవదాసు, ఎండీ.మహబూబ్ అలీ, జాయింట్ సెక్రటరీ ఎండీ.అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. టీఎస్ యూటీిఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు తాటికాయల కుమార్, జిల్లా కమిటీ సభ్యులు పి.అశోక్ కుమార్, ఎం.లక్ష్మయ్య, ఈ.ఇంద్రసేనారెడ్డి, వెంకటయ్య, సాంబయ్యలు మాటాడారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



