– లేదంటే తెలంగాణలో సినిమాలు ఆడవు
– సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి హెచ్చరిక
హైదరాబాద్, ప్రజాతంత్ర,డిసెంబర్ 2: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు రాజకీయాలు తెలియవని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పవన్ కల్యాణ్ తెలిసీతెలియకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ ఇటీవల కోనసీమలో పర్యటించిన సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ నాయకుల దిష్టి వల్ల ఈ ప్రాంతంలోని కొబ్బరి మొక్కలు ఎండిపోయాయన్నారు. ఈ వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి మంగళవారం హైదరాబాద్ లో కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ పవన్కల్యాణ్ను డిమాండ్ చేశారు. పవన్ క్షమాపణ చెబితే తెలంగాణలో ఆయన సినిమా ఒకటి, రెండు రోజులు ఆడుతుందని, లేకుంటే ఆడవని చెప్పారు. పవన్ కల్యాణ్ సోదరుడు చిరంజీవి సూపర్ మ్యాన్ అని ఈ సందర్భంగా అభివర్ణించారు. ఆయనకు రాజకీయాలతో సంబంధం లేదని గుర్తు చేశారు. అన్నీ తెలుసుకుని మాట్లాడితే మంచిదని పవన్ కల్యాణ్ కు మంత్రి హితవు పలికారు. పవన్ కల్యాణ్ వ్యా ఖ్యల వల్ల తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారన్నారు. ఉమ్మడి ఆంధప్రదేశ్ లో హైదరాబాద్ ఆదాయాన్ని విశాఖపట్నం, కాకినాడ, తిరుపతికే వాడుకున్నారని వివరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వల్ల నష్టపోయామని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని మంత్రి కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




