చెవి నొప్పితో హాస్పిటల్‌కి వెళితే..

– యువకుడి మృతి
– డాక్ట‌ర్ల నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మని కుటుంబీకుల ఆందోళ‌న‌

నిజమాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 25:  జిల్లాలో ఘోరం జరిగిపోయింది. చెవి నొప్పితో ఓ ప్రైవేట్‌ ‌హాస్పిటల్‌లో చేరిన యువకుడు మృతిచెందటం తీవ్ర విషాదాన్ని నింపింది. చేతికొచ్చిన కొడుకు అర్ధంతరంగా చనిపోవడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్‌ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో  హాస్పిటల్‌ ‌పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. భీంగల్‌ ‌మండలం పల్లికొండ గ్రామానికి చెందిన గంగం అజయ్‌ ‌మంగళవారం  చెవి నొప్పితో ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేరాడు. అజయ్‌ ‌కండిషన్‌ ‌చూసిన వైద్యులు ఆపరేషన్‌ ‌చేయాలని చెప్పారు. ఆపరేషన్‌ ‌కోసం మత్తు మందు ఇచ్చిన తర్వాత అజయ్‌ ‌చనిపోయాడు. దీంతో హాస్పిటల్‌ ‌వైద్యులు, మత్తు వైద్యుల నిర్లక్ష్యం మూలంగా అజయ్‌ ‌మృతిచెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హాస్పిటల్‌లో వెంటిలేటర్‌, ఎలాంటి సౌకర్యాలు లేవు అంటూ కుటుంబ సభ్యులు  ఆరోపించారు. చేతికొచ్చిన కొడుకు చనిపోయాడని, న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు హాస్పిటల్‌ ‌ముందు ఆందోళనకు దిగారు. హాస్పిటల్‌ ఎదుటనే అజయ్‌ ‌మృతదేహాన్ని దహనం చేస్తామని డీజిల్‌ ‌డబ్బాతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఆపరేషన్‌ ‌సమయంలో ఎక్కువ మోతాదులో మత్తు మందు ఇవ్వటం వల్లనే అజయ్‌ ‌మృతిచెందారని వారు ఆందోళనకు దిగారు. ఆ క్రమంలో పోలీసులు, కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *