– కిట్స్ డీన్ అకడమిక్ అఫైర్స్, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వేణుమాధవ్
– ముగిసిన ’సమ్ శోధిని-25’ గ్రాండ్ వాలెడిక్టరీ
వరంగల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 18: పరిశ్రమకు సిద్ధంగా ఉన్న ఇంజనీర్లు అధిక సిటిసి ఉపాధిని సాధించడానికి ఆవిష్కరణ, ఇంక్యుబేషన్, రీసెర్చ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్-ఐ స్క్వేర్ ఆర్‌ఈ సంస్కృతి పట్ల మక్కువ కలిగి ఉండాలని కిట్స్ డీన్ అకడమిక్ అఫైర్స్, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.వేణుమాధవ్ చెప్పారు. కిట్స్ వరంగల్ క్యాంపస్‌లో ఐఎస్‌టీఈ, కిట్స్ స్టూడెంట్ విద్యార్థి చాప్టర్, కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్ (కిట్స్‌డబ్ల్యు) టెక్నికల్ క్లబ్, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ (సాక్)తోపాటు పది విభాగాలు సంయుక్తంగా రెండు రోజులపాటు నిర్వహించిన జాతీయస్థాయి విద్యార్థి సాంకేతిక సింపోజియం ‘సమ్ శోధిని-25’ శనివారం కిట్స్ క్యాంపస్‌లో విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ వేణుమాధవ్ మాట్లాడుతూ ఊహ నుంచి ఆవిష్కరణ అనే ఇతివృత్తానికి సంబంధించి సంశోధిని-25ను ఉత్తమ రీతిలో నిర్వహించినట్లు చెప్పారు. ఇన్నోవేషన్ ప్రపంచంలో అర్థవంతమైన మార్పును నడిపిస్తోందని తెలిపారు. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్-ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో కూడిన ఇంజనీరింగ్ విభాగాలు, ఎంబిఎ వారు వివిధ సాంకేతకపరమైన 12 వర్క్‌షాప్‌లు విజయవంతంగా నిర్వహించారు. ప్రాజెక్ట్ ఎక్స్‌పో, ఇన్నోవిజన్, ట్రెజర్ హంట్, 80పై చిలుకు సాంకేతిక కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు. ఫెస్ట్ కన్వీనర్, డీన్ విద్యార్థి వ్యవహారాల ప్రొఫెసర్ ఎం.శ్రీలత మాట్లాడుతూ ఈ సింపోజియం విద్యార్థి సమాజానికి కచ్చితంగా ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. సమాజ ప్రయోజనాల కోసం సృజనాత్మక ఆలోచనలను అలవర్చుకోవాలని ఉద్బోధించారు. సింపోజియం ప్లాట్‌ఫాం వైవిధ్యభరితమైన ఇంజనీరింగ్, సాంకేతిక రంగాలలో ప్రతిభను, నైపుణ్యాన్ని ప్రదర్శించిందని, పరిశ్రమకు సిద్ధంగా ఉన్న ఇంజనీర్లను రూపొందించడంలో ఉత్సాహాన్ని ప్రదర్శించిందని చెప్పారు. కార్యక్రమంలో డీన్‌లు, వివిధ విభాగాల అధిపతులు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.కోొమల్ రెడ్డి, డీన్ స్టూడెంట్ ఎఫైర్స్ అండ్ ప్రోగ్రాం కన్వీనర్ ప్రొఫెసర్ ఎం.శ్రీలత, ఐఎస్‌టీఈ కిట్స్ చాప్టర్ చైర్మన్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి.మధుకర్ రెడ్డి, కో-కోఆర్డినేటర్స్ డాక్టర్ ఎస్.సునీల్ ప్రతాప్ రెడ్డి, డాక్టర్ బి.విజయ్ కుమార్, పీఆర్వో డాక్టరు డి.ప్రభాకరాచారి, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లు, ఐఎస్‌టీఈ కిట్స్ విద్యార్థి చాప్టర్ ప్రెసిడెంట్ వై.నాగతరుణ్, టెక్నికల్ క్లబ్ విద్యార్థి అధ్యక్షుడు కె.శశికాంత్, 4000 పైగా విద్యార్థులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



