సామాన్య కార్యకర్తలే బలగం

– బీజేపీ ఆవిర్భావ దిన వేడుకల్లో రామచందర్ రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6: కోట్లాదిమంది కార్యకర్తల నిస్వార్థ త్యాగం, అంకితభావం వల్లే బీజేపీ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ శక్తిగా ఎదిగిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. అందుకు కృషిచేసిన ప్రతి కార్యకర్తకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దిన వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఇది కేవలం సంబరాలు చేసుకునే రోజు మాత్రమే కాదని, దేశమే ప్రథమం అనే సిద్ధాంతం పట్ల నిబద్ధతను చాటుకునే గర్వకారణమైన రోజని పేర్కొన్నారు. సామాన్య కార్యకర్తలే బలగంగా, దేశ హితమే పరమావధిగా ప్రారంభమైన బీజేపీ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ శక్తిగా ఎదిగిందని, నాడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్‌పేయి వంటి మహనీయులు వేసిన పునాదులపై నేడు పార్టీ అప్రతిహతంగా దూసుకుపోతోందని అన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ప్రజల గొంతుకగా ప్రతీ కార్యకర్త పనిచేయాలన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దృఢమైన, స్వయం సమృద్ధమైన ‘వికసిత్ భారత’ నిర్మాణంలో ప్రతీ కార్యకర్త భాగస్వామి కావాలని రామచందర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, జాతీయ నాయకుడు మురళీధర్ రావు, శాసనమండలి ఫ్లోర్ లీడర్ ఏవీఎన్ రెడ్డి, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *