రాజన్న సిరిసిల్ల, ప్రజాతంత్ర, మార్చి 27: శ్రీరామనవమి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలోని హనుమాన్ ఆలయంలో సీతారామచంద్రస్వామి కల్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి. సంప్రయాదబద్దంగా పండితులు కల్యాణోత్సవం నిర్వహించారు. ఈ వేడుకల్లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.రాములోరి కల్యాణోత్సవాలకు హాజరైన సందర్భంగా కేటీఆర్‌కు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు
కూలిన వేదిక ఎమ్మెల్యే వేములకు తప్పిన ప్రమాదం
నల్లగొండ, ప్రజాతంత్ర, మార్చి 27: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశంకు తృటిలో ప్రమాదం తప్పింది. కేతేపల్లి మండలం బండపాలెంలో శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. శ్రీసీతారాముల కల్యాణోత్సవం నిర్వహిస్తున్న వేదిక అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు ఈ వేడుకల్లో పాల్గొని వెళ్లిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. సీతారాముల కల్యాణోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇలాంటి సమయంలో వేదిక కూలడంతో భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ అపశృతి జరిగిందంటూ తీవ్రంగా విమర్శించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





