పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం

కొద్దిసేపటికే లోక్‌సభ వాయిదా

దిల్లీ, జులై 21: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే లోక్‌సభ వాయిదా పడిరది, పహల్గాం దాడి, ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చకు కాంగ్రెస్‌ పట్టుబట్టింది. వాయిదా తీర్మానాలపై చర్చించాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశాయి. ప్రశ్నోత్తరాల తర్వాత నోటీస్‌ ఇస్తే ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చిద్దామని ప్రతిపక్షాలకు లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా సూచించారు. అన్ని అంశాలపై చర్చిద్దామని ఆయన సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా, విపక్షాలు ఆందోళనలు విరమించుకోకపోవడంతో స్పీకర్‌ లోక్‌సభను వాయిదా వేశారు. ప్రతిపక్షాల ఆందోళనలతో లోక్‌సభలో గందరగోళం నెలకొంది. కాగా, పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా మొత్తం ఏడు పెండిరగ్‌ బిల్లులతోపాటు మరో ఎనిమిది బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆగస్ట్‌ 21 వరకు నెల రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *