– చివరి రోజు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండానే ముగింపు
న్యూదిల్లీ, డిసెంబరు 19: పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. లోక్‌సభ, రాజ్యసభలు రెండూ నిరవధిక వాయిదా పడ్డాయి. ఉక్రవారం ఉదయం లోక్‌సభ ప్రారంభమైన కొద్దిసేపటికే వందేమాతర గీతాలపన అనంతరం స్పీకర్ ఓంబిర్లా సభను నిరవధిక వాయిదా వేశారు. లోక్‌సభకు ప్రధాని నరేంద్రమోదీ కూడా హాజరయ్యారు. ఆయన కూడా వందేమాతర గీతాన్ని పాడారు. అలాగే రాజ్యసభ 11 గంటలకు ప్రారంభమైంది. సభకు ఉపరాష్ట్రపతి సి.పి రాధాకృష్ణన్ హాజరయ్యారు. యధావిధిగానే ఆయన టేబుల్‌పై పత్రాలు, ప్రకటనలు, నివేదిక సంబంధించినవి ఆయన టేబుల్‌ద ఉన్నాయి. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ సభను నిరవధిక వాయిదా వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నిన్న మంత్రి సమాధానం ఇచ్చే సమయంలో సభలో సభ్యుల ప్రవర్తనపై పునరాలోచించు కోవాలి. నిరసన వ్యక్తం చేయడం, కాగితాలను చింపివేయడం వంటివి సభకు తగనివి. సభ్యులు తమ ప్రవర్తనపై ఆలోచించుకోవాలి అని ఆయన అన్నారు. ఈ సెషన్ చాలా ఉత్పాదకంగా జరిగిందని, రాబోయే సెషన్లలో ఫలవంతమైన చర్చలు జరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జీరో అవర్, ప్రశ్నోత్తరాల సమయంలో నాణ్యతతో కూడిన చర్చలు చాలా విజయవంతంగా జరిగాయని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ పార్లీమెంటు సమావేశాల్లో ప్రధానంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రాణ ఉపాధి హా చట్టానికున్న పేరును విబి జి రామ్ జి బిల్లుగా తెచ్చిన సవరణ బిల్లును ప్రతిపక్ష ఎంపీల ఆందోళనల మధ్యే కేంద్రం ఆమోదింపజేసుకుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



