Parliament: పార్లమెంట్‌లో ఒత్తిడి పెంచండి

– ఐఏసీసీ అధ్యక్షుడు ఖర్గేకు సీఎం రేవంత్‌ రెడ్డి వినతి
– బీసీ పోరుబాట ధర్నా, ఇతర కార్యక్రమాలపై చర్చ

దిల్లీ, ఆగస్టు 7: బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు(localbody elections), విద్య, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లకు ఉద్దేశించిన బిల్లులకు ఆమోదం తెలిపేలా కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంటు(parliament)లో ఒత్తిడి తేవాలని ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గేకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి (Revanthreddy) విజ్ఞప్తి చేశారు. పార్లమెంటులో ఖర్గేతో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ గౌడ్‌, మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గురువారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో కుల సర్వే తీరుచ, తర్వాత రాష్ట్ర శాసనసభలో బిల్లుల ఆమోదం విషయాలను పార్టీ సీనియర్‌ నేతలు జైరాం రమేశ్‌ తదితరులకు సీఎం, పీసీసీ అధ్యక్షుడు వివరించారు. రాష్ట్రంలో రిజర్వేషన్ల సవరణకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను గవర్నర్‌ ఆమోదించకుండా నెలలతరబడి పెండిరగ్‌లో ఉంచిన విషయాన్ని ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు. బిల్లులను ఆమోదించాలని కోరుతూ రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌కు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. బిల్లుల ఆమోదం కోరుతూ తనతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్‌లు, బీసీ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో జంతర్‌మంతర్‌లో బుధవారం ధర్నా నిర్వహించిన విషయాన్ని, ఇండి కూటమిలోని పార్టీల ఎంపీలు సంఫీుభావం తెలిపిన విషయాన్ని సీఎం వివరించారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *