తల్లిదండ్రులు పిల్లలకు బరువు కాదు

– డాక్టర్ అనితా రెడ్డి

హన్మకొండ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: ప్రభుత్వం వృద్ధుల కోసం డే కేర్ సెంటర్ నిర్వహిస్తోందని, వయోవృద్దులు దానిని వినియోగించుకోవాలని అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్‌పర్సన్, సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ మెంబర్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలు డాక్టర్ అనితా రెడ్డి అన్నారు. హన్మకొండ జిల్లా పరిషత్ ఆవరణలోని సీనియర్ సిటిజన్స్ డే కేర్ సెంటర్ను సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ మెంబర్‌గా వారికి మెరుగైన సౌకర్యాలు అందజేయడానికి తన వంతు కృషి చేస్తున్నానని తెలిపారు. వయోవృద్దులు ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకు రావచ్చన్నారు, ట్రిబ్యునల్ కోర్టు ద్వారా సహాయసహకారాలు అందిస్తానని చెప్పారు. పిల్లలకు తల్లిదండ్రులు బరువు కాకూడదని, బాధ్యత కావాలని అన్నారు. ఎవరికీ వృద్ధాప్యం శాపం కాకూడదని, వారికి కడవరకు ప్రేమ, ఆప్యాయత, గౌరవం దక్కాలని డాక్టర్ అనితా రెడ్డి అన్నారు, డే కేర్ సెంటర్‌లో ఫ్రీ లీగల్ సెంటర్, ఆరోగ్యం కోసం ఫ్రీ ఫిజియోథెరపీ సెంటర్ ఏర్పాటు చేశామని, వాటిని వినియోగించుకోవాలని సూచించారు, ఒంటరిగా ఉన్న వయో వృద్ధులకు డే కేర్ సెంటర్‌లో లైబ్రరీ కాలక్షేపానికి చక్కగా ఉపయోగపతుందుని అన్నారు. వృద్ధుల సౌకర్యార్థం టీవీ, ఎయిర్‌కూలర్, కుర్చీలు, ఆహ్లాదకరంగా ఉండటానికి ఆట వస్తువులు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో ఫిజియోథెరపీ డాక్టర్ ఉష, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వరంగల్ సెక్రటరీ దేవాచారి, వైస్ చైర్మన్ రాంమూర్తి, ముఖ్య సలహాదారులు పి.వి.శ్రీనివాసరావు, శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *