పరకాల మా అడ్డా

– సురేఖ అక్కడి నుంచే పోటీ చేస్తారు: కొండా మురళి

వరంగల్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 4: పరకాల త‌మ‌ అడ్డా అని, వచ్చే ఎన్నికల్లో కొండా సురే అక్కడి నుంచే పోటీ చేస్తారని మాజీ ఎమ్మెల్సీ, మంత్రి కొండా సురేఖ భర్త మురళి కీలక వ్యాఖ్యలు చేశారు. గీసుగొండ మండలంలోని కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతరలో ఆయ‌న‌ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తన బిడ్డ‌ కొండా సుస్మిత ఎవరినైనా ఎదిరిస్తుందని చెప్పారు. తనకన్నా సుస్మిత ధైర్యవంతురాలని తెలిపారు. కార్యకర్తలకు సమస్య వస్తే ఎవర్నీ వదలిపెట్టదన్నారు. ఎంతటివారినైనా ధైర్యంగా ఎదుర్కొంటుందని మురళి పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *