కొండగట్టు ఆలయంలో అపశ్రుతి

– చలువ పందిరి కూలి 15మందికి గాయాలు

జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజన్న ఆలయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆలయం వద్ద వేసిన చలువ పందిరి కూలి 15 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా బుధవారం నుంచి మూడు రోజులపాటు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హనుమాన్ మాల విరమణ కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. భక్తులకు తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లు కూడా వేశారు. అయితే నాసిరకంగా ఏర్పాట్లు చేయడంతో కేశ ఖండ‌న వ‌ద్ద వేసిన‌ చలువ పందిరి కూలిపోయిందని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాయ‌ప‌డిన వారిని జ‌గిత్యాల ప్ర‌భుత్వ హాస్సిట‌ల్‌కు త‌ర‌లించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *