– కార్యాలయాల్లో మంత్రి తుమ్మల ఆకస్మిక తనిఖీలు
– సమయానికి రాని అధికారులపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 12: వ్యవసాయం, మార్కెటింగ్, సహకార, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌ెటైల్స్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన పరిధిలోని శాఖల ప్రధాన కార్యాలయాల్లో బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హాకా, సీడ్ సర్టిఫికేషన్ కార్పొరేషన్, సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్‌ెటైల్స్ ప్రధాన కార్యాలయాలను సందర్శించారు. తనిఖీల సందర్భంగా సమయానికి హాజరుకాని కొంతమంది అధికారులపై మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పొరుగు సేవల సిబ్బంది సమయపాలన పాటిస్తుండగా రెగ్యులర్ ఉద్యోగులలో ముఖ్యంగా జనరల్ మేనేజర్, మేనేజర్ స్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలనను కఠినంగా అమలు చేయాలని, విధులపట్ల అలసత్వం ప్రదర్శించే అధికారులపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని మంత్రి హెచ్చరించారు. సమయానికి విధులకు హాజరు కాని అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల కమిషనర్లు, ఎండీలకు మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. ఉన్నతస్థాయి అధికారుల నుండి కిందిస్థాయి సిబ్బంది వరకు అందరూ సమయపాలన పాటిస్తూ ప్రజా సేవలో బాధ్యతాయుతంగా వ్యవహరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




