హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30: పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన పి.జోగారెడ్డి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్కను ప్రగతి భవన్‌లో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క జోగారెడ్డిని అభినందించారు. ప్రజా ప్రభుత్వం పంచాయతీరాజ్ విభాగంలో నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, భవనాలు, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని ఆకాంక్షించారు. నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామానికి చెందిన జోగారెడ్డి పంచాయతీరాజ్ విభాగంలో 1989లో ఏఈగా విధుల్లో చేరారు. అదేవిధంగా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావును కూడా మర్యాదపూర్వకంగా కలిశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



