~ ఇంకా ఆమోదం పొందని (మూడో సవరణ) చట్టం
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11: తెలంగాణ పంచాయతీరాజ్ (రెండో సవరణ) చట్టం 2025 బిల్లుపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. ఈమేరకు గెజిట్ విడుదలయింది. తెలంగాణ పంచాయతీరాజ్ (రెండో సవరణ) చట్టం-2025లో సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు, ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరణ, నల్గొండ జిల్లాలోని హాలియా మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపేటను నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. గ్రామీణ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల సడలింపునకు ఉద్దేశించిన తెలంగాణ పంచాయతీరాజ్ (మూడో సవరణ) చట్టం- 2025 బిల్లు ఇంకా గవర్నర్ ఆమోదం పొందలేదు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





