పంచాయతీ కార్యదర్శులకు శుభవార్త

` పెండిరగ్‌ బిల్లులన్నీ ఒకేసారి క్లియర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబరఠ్‌ 29: రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శుల కోసం ఒకేసారి భారీ మొత్తంలో నిధులను విడుదల చేసింది. పంచాయతీ కార్యదర్శుల బిల్లుల క్లియరెన్స్‌ కోసం ప్రభుత్వం రూ.104 కోట్లు విడుదల చేసింది. దీంతో వారి పెండిరగ్‌ బిల్లులన్నీ క్లియర్‌ అయ్యాయి. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క చొరవతో ఎప్పుడూ లేని విధంగా ఒకే విడతలో ఇంత పెద్ద మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ చర్యతో పంచాయతీ కార్యదర్శులపై ఉన్న ఒత్తిడి తగ్గి ఊరట లభించింది. ఈ సందర్భంగా ఆ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శుల సమస్యలు అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెంటనే స్పందించి రూ.104 కోట్లు విడుదల చేశారు. ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి ఇంత పెద్ద మొత్తాన్ని విడుదల చేయడం పంచాయతీ వ్యవస్థ పటిష్టతకు దోహదం చేస్తుంది అని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *