– పిటిషన్లపై విచారణలో హైకోర్టు స్పష్టీకరణ
హైదరాబాద్‌,‌ డిసెంబరు 4 :‌పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లలో జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. చట్టప్రకారం ఎన్నికల పక్రియలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన రిజర్వేషన్‌ల వ్యవహారంలో దాఖలైన ఆరు పిటిషన్‌లపై విచారించిన హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఎస్సీ, ఎస్టీ జనాభా లేని చోట కూడా ఆయా కులాలకు వార్డుమెంబర్లు, సర్పంచి రిజర్వేషన్లు కేటాయించారన్న పిటిషనర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. 2011 జనాభా లెక్కల ప్రకారం సర్పంచి రిజర్వేషన్లు కేటాయించడం వల్ల తప్పులు దొర్లాయని తెలిపారు. రిజర్వేషన్లు కేటాయించిన చోట సంబంధిత కులానికి చెందిన వ్యక్తులు లేకపోతే ఎన్నికల నిర్వహించబోమని ఎన్నికల సంఘం కోర్టుకు తెలిపింది. ఎస్‌ఈసీ వాదనను రికార్డు చేసుకున్న హైకోర్టు.. పిటిషన్లపై విచారణ ముగించింది.
————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.